TS : ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి కూన శ్రీశైలం గౌడ్?

బీజేపీ (BJP) నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ (Kuna Srisailam Goud) ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలతో మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి.. కూన శ్రీశైలంను కలిసి, పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి శ్రీశైలం గౌడ్ అంగీకరించారని, ఇవాళ హస్తం పార్టీలో చేరతారని సమాచారం.
గతంలో కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.అయితే రాజకీయ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఆయన బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ కూన శ్రీశైలం గౌడ్ బీజేపీని వీడుతారనే ప్రచారం సాగింది. కానీ ,కూన శ్రీశైలం గౌడ్ మాత్రం బీజేపీలోనే కొనసాగారు.
కూన శ్రీశైలం గౌడ్ మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2005 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు.
పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014,2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com