TS : కాంగ్రెస్ చెప్పేదొకటి..చేసేది ఇంకొకటి.. కేటీఆర్ లేటెస్ట్ ట్వీట్

కాంగ్రెస్ (Congress) ఎప్పుడూ ఒకటి చెప్పి మరోటి చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉంటాయని అన్నారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుందని గుర్తు చేశారు. అందులో ఒక ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో మాత్రం తమ ప్రవర్తనకు విరుద్ధంగా అంశాలను పొందుపర్చిందని అన్నారు కేటీఆర్. హామీలపైన నిబద్ధత ఉంటే ఈ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
ట్విట్టర్ లో లేటెస్ట్ పోస్ట్ చేసిన కేటీఆర్ (KTR).. కాంగ్రెస్ పార్టీ కపటవాదుల పార్టీ కాదనీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అయినా చెప్పగలరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేను వారి పదవులకు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. వారు అనర్హులని స్పీకర్ ప్రకటించాలని అన్నారు. చెప్పిందే చేస్తామనీ.. అబద్దాలు చెప్పబోము అని కాంగ్రెస్ పార్టీ రుజువు చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆయా రామ్ గయా రామ్ సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ మాతృసంస్థ అన్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వడాన్ని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందనీ.. పదో షెడ్యూల్ చట్ట సవరణ హామీ స్వాగతించిందని కేటీఆర్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com