Congress : ఖమ్మం అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు.. తెరపైకి కొత్త పేర్లు

ఖమ్మం (Khammam) లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించగా పార్టీ అధిష్ఠానం తిరస్కరించినట్లు సమాచారం. దీంతో మాజీ ఎంపీ సురేంద్రరెడ్డి తనయుడు రఘురామిరెడ్డికి సీటు ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.
వీరు కాకుండా కొత్తగా సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ కుమార్తె టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని పేర్లు తెరపైకి వచ్చాయి. నిజామాబాద్ కు చెందిన మండవ వెంకటేశ్వరరావుకు పార్లమెంట్ టికెట్ పై గతంలో హామీ ఇచ్చారని, కమ్మ సామాజికవర్గం నుంచి ఆయన్ను ఖమ్మంలో పోటీకి నిలబెట్టడం ద్వారా పలు ఈక్వేషన్లను వర్కవుట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఇటీవల సుహాసిని భేటీ అయ్యారు. 2018 ఎన్నికల్లో ఆమె టీడీపీ కూటమి తరఫున కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు టికెట్ ఇవ్వడం ద్వారా పాత టీడీపీ కేడర్ ను ఆకట్టుకోవడం కూడా ఈజీ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com