TS : డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ అనుచరులు.. అభ్యర్థి అశోక్ సార్ పై దాడి

TS : డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ అనుచరులు.. అభ్యర్థి అశోక్ సార్ పై దాడి
X

నల్గొండ జిల్లా నార్కట్ పల్లె లోని డోకూరు ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్న ఘటన గొడవకు దారితీసింది. అడ్డుకునేందుకు వెళ్లిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ పై కాంగ్రెస్ నేతలు దాడి చేసినట్టు సమాచారం.

వీడియో రికార్డు చేస్తున్న మీడియా సిబ్బందిపై దాడి చేశారని.. కెమెరాలు ధ్వంసం, ఫోన్లు ధ్వంసం చేసినట్టు తెలిసింది. ఈ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని.. ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడిల చేసిందని సాక్షులు తెలిపారు.

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అశోక్ పట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు ఎవరంటూ అశోక్ పై దాడి చేశారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా కార్యకర్తలు దాడి చేశారని..పోలీస్ స్టేషన్ లో చెప్పారు అశోక్. బయట బైఠాయించి తన నిరసన తెలిపారు.

Tags

Next Story