TG : కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

TG : కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
X

బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ( Sanjay Kumar ) ఆ పార్టీని వీడి పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సంజయ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది.

ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్ రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా సంజయ్ చేరారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంజయ్న కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రెండుసార్లు వరుసగా ఎన్నికయ్యారు.

వృత్తి రీత్యా వైద్యుడైన సంజయ్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కేసీఆర్ కుమార్తె కవిత ప్రాతినిథ్యం వహించిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి జగిత్యాల కూడా రావడంతో కవిత తరచూ ఈ నియోజకవర్గంలో పర్యటించేవారు.

Tags

Next Story