TG : ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లై ఓవర్ కాంట్రాక్ట్ రద్దు

TG : ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లై ఓవర్ కాంట్రాక్ట్ రద్దు
X

ఎప్పుడో ఆగిపోయిన ఉప్పల్ - ఘట్ కేసర్ ప్లై ఓవర్ పనులకు అతిత్వరలోనే తిరిగి మొదలుకానున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణం, కాంట్రాక్టు అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కాంట్రాక్ట్ సంస్థను టెర్మినేట్ చేసి కొత్తగా టెండర్లు పిలవాల్సిందిగా కేంద్ర రోడ్డు రవాణా - రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు.

సోమవారం తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడ్కరీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఉప్పల్ - ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యం, ఆ కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యల గురించి వెంకటరెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి అధికారులను పిలిపించి, కాంట్రాక్ట్ సంస్థను టెర్మినేట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

మరోవైపు హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలుగా విస్తరించే విషయంపై కూడా కేంద్రమంత్రితో మాట్లాడారు. రాష్ట్రంలోని 16 రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కూడా కేంద్ర మంత్రిని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం గురించి కూడా కేంద్ర మంత్రితో చర్చించారు.

Tags

Next Story