TS : నోరు అదుపులో పెట్టుకోండి.. కోమటిరెడ్డి వార్నింగ్

TS : నోరు అదుపులో పెట్టుకోండి.. కోమటిరెడ్డి వార్నింగ్

చిట్ చాట్ లు, ప్రెస్ మీట్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు. కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కామెంట్లతో గందరగోళం రేపేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిలపై వరుసగా మాటల దాడి చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నల్లగొండలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఏక్ నాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ పార్టీ అనీ.. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలికారు. రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని.. కాంగ్రెస్‌లో ఏక్ నాథ్ షిండేలు, గ్రూపులు లేవన్నారు. అందరం రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు.

పార్టీ చీఫ్ గా బండి సంజయ్ ను ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డి తెలుసుకోవాలని.. పనికిరాని చిట్ చాట్‌లు బంద్ చేయాలని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story