TG : పాఠ్య పుస్తకాల రచ్చ.. ఇద్దరిపై వేటు

TG : పాఠ్య పుస్తకాల రచ్చ.. ఇద్దరిపై వేటు
X

తెలుగు పాఠ్య పుస్తకాల్లో 'ముందుమాట' దొర్లిన తప్పులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముందుమాట సందేశంలో సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబిత పేర్లను ప్రచురించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సంబంధిత ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు.

ఈ పొరపాట్లు జరగడానికి కారణాలేంటో చెప్పాలని, ఈ అంశంపై వివరణ ఇవ్వాలని బాద్యులైన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి (ఎస్ఈఆర్టీ) డైరెక్టర్ రాధారెడ్డి, పాఠ్య పుస్తకాల ముద్రణాలయం డైరెక్టర్ మూర్తిలకు ప్రభుత్వం తాఖీదులు జారీ చేశారు. ముద్రణలో జరిగిన పొరపాట్లపై తక్షణమే వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఆదేశించారు.

ఇద్దరు ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. రేవంత్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది.

Tags

Next Story