కుటుంబాన్ని బలి తీసుకున్న కరోనా..!

కుటుంబాన్ని బలి తీసుకున్న కరోనా..!
తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు.. భార్యను పోగొట్టుకొని భర్త... భర్తని పోగొట్టుకుని భార్య... ఇలా కడు దుఖాన్ని మిగులుస్తుంది.

కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు.. భార్యను పోగొట్టుకొని భర్త... భర్తని పోగొట్టుకుని భార్య... ఇలా కడు దుఖాన్ని మిగులుస్తుంది. కామారెడ్డిలో కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి.. ఇద్దరు పిల్లలు అనాధలుగా మిగిలిన సంఘటన అందరినీ కలిచివేస్తోంది. పంచముఖి హనుమాన్ కాలనీలో నివాసముంటున్న రాజేష్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు కూతుళ్లు గత ఏడాది కరోనా బారినపడి ఇంట్లోనే ఉండే మందులు వాడాడు.

అయితే నాలుగు రోజుల తర్వాత అతను కరోనాతో మరణించాడు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి మాయదారి మహమ్మారి మరోసారి వెంటాడింది. ఈ ఏడాది రాజేష్ భార్య కూతుళ్లకు కరోనా సోకింది. అయితే ఇద్దరు కూతుళ్లు కోరుకోగా తల్లి మాత్రం తీవ్ర అస్వస్థతకు గురైంది. అయితే ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది హైదరాబాద్ లో చికిత్స పొందుతూ రాజేష్ భార్య కూడా మరణించింది. దీనితో వారిద్దరూ పిల్లలు అనాధలుగా మిగిలారు.

మరోవైపు తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ ఇద్దరు కూతుళ్లు నానమ్మ వద్ద ఉంటున్నారు. తన బాధ్యతను చూసుకోవాల్సిన కొడుకు, కోడలు దూరం కావడంతో పిల్లల భారం నానమ్మపై పడింది . ముసలి వయసులో పిల్లలను ఎలా పెంచి పెద్ద చేయాలని సిద్దమ్మ అంటుంది. అంతేకాదు ఇంటి నిర్మాణం కోసం రాజేష్ బ్యాంకులో 16 లక్షల వరకు అప్పు చేశాడు. మరోవైపు కొడుకు,కోడలు వైద్యం కోసం మరో 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. దాదాపుగా 21 లక్షల అప్పు ఎలా తీర్చాలి అని కన్నీరుమున్నీరవుతుంది సిద్దమ్మ.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటుంది సిద్ధమ్మ.



Tags

Read MoreRead Less
Next Story