Karimnagar : రైల్వే ట్రాక్ పై పడి ప్రేమజంట మృతి

Karimnagar :  రైల్వే ట్రాక్ పై పడి ప్రేమజంట మృతి
X

ప్రేమజంట రైల్వే ట్రాక్పై మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచే సుకుంది. జమ్మికుంట మండలం బిసిగిర షరీఫ్ రైల్వే స్టేషన్ పరిధి పాపయ్యపల్లి రైల్వే గేట్ సమీపంలో నిన్న రాత్రి రైల్వే ట్రాక్పై ప్రేమజంట 52 గూడ్స్ రైలు కిందపడి ఆత్మ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచా రంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. యువకుడు ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన రాహుల్ (18)గా గుర్తించారు. రాహుల్ హైదరాబాదులో ఓ బేకరీ లో పనిచేస్తూ ఉండేవాడని గత మూడు రోజుల క్రితం ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఎగ్జామ్ రాయడానికి జమ్మికుంటకు వచ్చి నిన్న రాత్రి ఇంటిలో నుంచి బయటకు వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. యువతి వివరాలు ఇంకా తెలియ రాలేదు. డెడ్ బాడీలను జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.

Tags

Next Story