TS : తెలంగాణలో ఒంటరిగానే సీపీఎం పోటీ

TS : తెలంగాణలో ఒంటరిగానే సీపీఎం పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం (CPM) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ప్రకటించింది. త్వరలోనే మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో ఆశావ‌హులు టికెట్ల కోసం పార్టీ పెద్దల‌ను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ‌లోని (Telangana) 17 లోక్‌స‌భ స్థానాల‌కు మే 13న ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి, ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఏప్రిల్ 18 నుంచి నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు.

మరోవైపు భువనగిరి పార్లమెంట్​ సీటు కోసం నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో టఫ్​ ఫైట్​ నడుస్తోంది. తమవారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీ లీడర్లంతా రంగంలోకి దిగడంతో పొలిటికల్ ​హీట్ ​పీక్స్​కు చేరింది. కుటుంబసభ్యుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్​ పోటీపడ్తుండగా, అనుచరుడి కోసం ఏకంగా సీఎం ప్రయత్నిస్తుండడం విశేషం. ఈ ముగ్గురి మధ్యలోకి ఇటీవల బీఆర్ఎస్​ నుంచి ఎంట్రీ ఇచ్చిన గుత్తా అమిత్, పైళ్ల శేఖర్​రెడ్డి ఏఐసీసీ స్థాయిలో పైరవీలు చేయిస్తుండడం ఆసక్తిరేపుతోంది

Tags

Read MoreRead Less
Next Story