CP Tarun Joshi : డ్రగ్స్, నకిలీ పత్తి విత్తనాలను అరికట్టాలి : సీపీ తరుణ్ జోషి

ఘట్ కేసర్, వెలుగు: నకిలీ పత్తి విత్తనాలు, డ్రగ్స్ సరఫరాను అరికట్టాలని, అంతర్ రాష్ట్ర ముఠాలను అణచివేసి పీడీ యాక్టులు ప్రయోగించాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి చెప్పారు. ఘట్ కేసర్ లోని ఏస్ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం రాచకొండ కమిషనరేట్పరిధిలోని డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు ఇతర అధికారులతో సీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషనరేట్పరిధిలో ఇప్పటి వరకు ఎన్డీపీఎస్ చట్టం కింద 92 కేసులు నమోదయ్యాయని, 181 మందిని అరెస్ట్చేశామని సీపీ తరుణ్‌జోషి చెప్పారు. విచారణలో పాటించాల్సిన నూతన విధానాల మీద అధికారులు, సిబ్బంది సంపూర్ణ అవగహన కలిగి ఉండాలని సూచించారు. రిటైర్డు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములు నూతన చట్టాల మీద సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేశ్చంద్ర, ఎల్ బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఎస్బీ డీసీపీ కరుణాకర్, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ సైబర్ క్రైమ్ చంద్రమోహన్, డీసీపీ ఎస్ఓటి మురళీధర్ పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com