TG : ‘కాళేశ్వరం’పై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు!

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి అధికారులు సరైన వివరాలు వెల్లడించాలని కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ స్పష్టం చేశారు. విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్‌లో పొందుపరచాలని స్పష్టం చేశారు. అందులో పేర్కొన్న వివరాలు వాస్తవ విరుద్ధంగా ఉంటే ఆయా అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. కాగా, బ్యారేజీలపై విచారణకు ప్రభుత్వం ఘోష్ అధ్యక్షతన కమిషన్‌ను నియమించింది.
కాళేశ్వరంలోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ, నాణ్యత, నిర్వహణ లోపాలు, అవినీతి, నిధుల దుర్వినియోగాన్ని వెలికితీసి.. వాటికి బాధ్యులను గుర్తించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ మంగళవారం క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లను పలు అంశాలపై ప్రశ్నించారు. వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీల స్థితిగతులపై తెచ్చుకున్న నివేదికలపై స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డీఎ్‌సవో) అధికారులను విచారించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com