TG : పంట రుణమాఫీ వీరికి వర్తించదు

తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంట రుణమాఫీ అమలుకు సమయం ఆసన్నమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోపల 2 లక్షల రుణమాఫీని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలపగా.. ఈరోజు పంట రుణమాఫీ మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది సర్కారు. కాగా.. ఈ మార్గదర్శకాలలో రేవంత్ రెడ్డి సర్కారు రేషన్ కార్డును తప్పనిసరి చేయటమే కాకుండా.. కొన్ని నిబంధనలు కూడా పెట్టటం గమనార్హం. ఈ మార్గదర్శకాల నేపథ్యంలో.. రైతులందరికీ ఈ రుణమాఫీ పథకం వర్తించదు. పూర్తి వివరాలివిగో..
ఆహార భద్రతా కార్డు ప్రామాణికంగానే ఈ పంట రుణమాఫీని ప్రభుత్వం అమలు చేస్తుండటంతో.. ఇది కేవలం తెల్లరేషన్ కార్డుదారులకు మాత్రం ఈ పథకం వర్తించనుంది. దీన్ని బట్టి.. పింక్ రేషన్ కార్డు దారులతో పాటు ట్యాక్స్ పేయర్లకు కూడా రుణమాఫీ పథకం వర్తించదని తెలుస్తోంది. ఇక.. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే.. దీర్ఘకాలిక పంటలకు ఈ రుణమాఫీ వర్తించదన్న మాట. అంటే.. వరి, పత్తి, చెరుకు, కూరగాయలు లాంటి సీజనల్ పంటలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. ఇక.. మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి దీర్ఘ కాలిక పంటలకు రుణమాఫీ వర్తించదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com