Dating App : డేటింగ్ యాప్‌లతో పబ్బుల సరికొత్త మోసం

Dating App : డేటింగ్ యాప్‌లతో పబ్బుల సరికొత్త మోసం

హైదరాబాదులో కొత్త రకం మోసం బయటపడింది. పబ్బు యజమానులు అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్ లో కొత్త మోసాలు చేస్తున్నారు. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు పబ్ యజమానులు.

టిండర్, బంబుల్ యాప్ లలో ఇటీవల చాలా మంది అబ్బాయిలు.. అమ్మాయిలతో పరిచయం పెంచుకుని వాళ్లను ఫిజికల్ గా కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీన్ని కొన్ని క్లబ్బులు, పబ్బులు క్యాష్ చేసుకుంటున్నాయి. కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెర తీశారు.

టిండర్లో రీసెంట్ గా రితికా అనే అమ్మాయి అబ్బాయికి పరిచయం చేసుకుంది. పరిచయం అయిన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి పిలిచింది. మరుసటి రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద చేరుకున్నారు. స్టేషన్ పక్కనే ఉన్న గలేరియా మాల్ లోని మోష్ క్లబ్ కి వెళ్దామని చెప్పి అక్కడికి రితిక్ తీసుకెళ్లింది. తియ్యని మాటలు చెప్పి ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి తాగి 40,505 రూపాయల బిల్ ను చేతిలో పెట్టి చల్లగా జారుకుంది రితిక. బిల్లును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ వ్యాపారవేత్త. రితిక తూలకుండా బయటికి వెళ్లిపోవడంతో కంగుతిన్న వ్యాపారవేత్త.. గూగుల్ రివ్యూస్ తో అసలు విషయం తెలుసుకున్నాడు. ఇక్కడ క్లబ్, డేటింగ్ యాప్ పేరుతో మోసం జరుగుతోందని.. అరికట్టాలని పేరు చెప్పకుండా పోలీసులకు కంప్లయింట్ చేశాడు. దీంతో.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గూగుల్ రివ్యూస్ తో పలు పబ్బులో ఇలాంటి మోసాలు జరిగినట్లు గుర్తించారు.

Tags

Next Story