TG : దర్గా సమీపంలో కూర్చున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం

X
By - Manikanta |21 Dec 2024 5:00 PM IST
నల్లగొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ దర్గా సమీపంలో రోడ్డుపక్కన కూర్చున్న వారిపైకి డీసీఎం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు దేవరకొండ మండలం ఎర్రారం తాటికల్ వాసులుగా గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com