Deepa Das Munshi : బీజేపీ నేతపై దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా

Deepa Das Munshi : బీజేపీ నేతపై దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా
X

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనపై నిరాధార మైన ఆరోపణలు చేశారని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టులో రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. శుక్రవారం కోర్టులో 40 నిమిషాల పాటు దీపాదాస్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.

ఈకేసుకు సంబంధించి తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఎంపీ ఎన్నికల సందర్భంగా బెంజ్ కార్లు, డబ్బులు తీసుకుని దీపాదాస్ మున్షీ రాష్ట్ర నేతలకు ఎంపీ టికెట్లు వచ్చేలా చేశారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో ఆరోపించారు.

ఆమె పార్టీలో తన పదవిని అడ్డు పెడ్డుకుని క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను అప్పట్లోనే ఖండించిన దీపాదాస్ ఆ ఆరోపణలను నిరూపించాలని ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో దీపాదాస్ తాజాగా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

Tags

Next Story