TS : నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ ఆమె తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సీబీఐ కోర్టు కవితకు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాధారణ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిన్న కోర్టు కవితకు ఈ నెల 23 వరకు జుడీషియల్ కస్టడీ పొడిగించింది.
మరోవైపు.. కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి..‘కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని, ఆప్-సౌత్ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారు. లిక్కర్ స్కాంలో భాగంగా రూ.100కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారు. కిక్ బ్యాగ్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారు. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్‌లో డేటాను డిలీజ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో, కవిత బెయిల్ పిటిషన్ పై విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవితకు రెగ్యులర్ బెయిల్ వస్తుందా, లేదా? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే విషయం మధ్యాహ్నం కల్లా తేలిపోనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com