TS : కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఈడీ, సీబీఐ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. రౌస్ అవెన్యూ కోర్టు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో ఆమె హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్‌లో ఉన్న సమయంలోనే.. ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. అయితే.. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం రిమాండ్‌లో కొనసాగుతుండగా.. బెయిల్ కోసం పిటిషన్లు వేయగా.. వాటిని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరింటింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకంగా ఉన్న కవితకు బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందంటూ అధికారుల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం బెయిల్‌కు నిరాకరించింది. ఇదే సమయంలో.. కస్టడీని కూడా పొడిగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com