TS : కరెంట్ పై తప్పుడు ప్రచారం చేస్తే జైల్లోవేస్తాం.. భట్టి వార్నింగ్

కాంగ్రెస్ (Congress) పై బీఆర్ఎస్ (BRS సోషల్ యాంటీ క్యాంపెయిన్ పెరగడంతో సర్కారు అలర్టైంది. కరెంట్ కోతలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
తమ ప్రాంతంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పెట్టగా, తాము క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తప్పుడు ప్రచారం అని తేలిందని విద్యుత్ అధికారులు భట్టి దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు.
రైతులకు, వాణిజ్య వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు ఆ శాఖ అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎండీలు, ఎస్‌ఈలతో వీడియో లింక్ కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పాల్గొని వేసవి ఇంధన కార్యాచరణ ప్రణాళికను పరిశీలించారు. విద్యుత్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నా, సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. కమర్షియల్ ఏరియాల్లో మెయింటెనెన్స్ కోసం రాత్రిపూట లైన్ క్లియరెన్స్ (ఎల్‌సీ) పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com