TS : కాంగ్రెస్‌లోకి దానం జంప్..? చేరికల లిస్ట్ చాలా పెద్దదే!

TS : కాంగ్రెస్‌లోకి దానం జంప్..? చేరికల లిస్ట్ చాలా పెద్దదే!

పార్టీ మారిన లీడర్లకే ఎంపీ టికెట్లు వస్తున్నాయి. తెలంగాణలో నడుస్తున్న ట్రెండ్ ఇదే. తెలంగాణ (Telangana) నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెల్చుకునే లక్ష్యంతో కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కిషన్ రెడ్డిపై దానం నాగేందర్ ను బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది. దానం కూడా రెడీ అన్నట్లుగా చెబుతున్నారు.

దానం నాగేందర్ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కాంగ్రెస్ సీనియర్లందర్నీ కలిశారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఒక్కటే మిగిలింది. సికింద్రాబాద్ అభ్యర్థిగా కిషన్ రెడ్డిపై దానంను దింపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీంతో.. దానం చేరిక తర్వాత భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు.

కాంగ్రెస్ లో చేరబోతున్న లీడర్ల లిస్ట్ పెద్దగానే ఉంది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ.రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వీరంతా రెండు రోజుల్లో పార్టీలో చేరబోతున్నారు. రేవంత్ వైజాగ్ టూర్ తర్వాత ఢిల్లీ వెళ్తారు. అక్కడే వీళ్లంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని..వీరిలో చాలామంది పేర్లు లోక్ సభ అభ్యర్థుల జాబితాలో వస్తాయని తెలుస్తోంది. బీజేపీ నేత జితేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. సోమవారం కాంగ్రెస్ ప్రకటించే మూడో జాబితాలో తెలంగాణ నుండి తొమ్మిది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

Tags

Next Story