TG : కేసీఆర్ కుటుంబం కోసమే ధరణి..అక్బరుద్దీన్ విసుర్లు

TG : కేసీఆర్ కుటుంబం కోసమే ధరణి..అక్బరుద్దీన్ విసుర్లు
X

అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయడంపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుటుంబం (కేసీఆర్ కుటుంబం) కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి? అని ప్రశ్నించారు. ముమ్మాటికీ ధరణిలో అక్రమాలు జరిగాయని, ధరణి కేవలం కేసీఆర్ కుటుంబం కోసం తీసు కొచ్చారని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రజల కోసం వచ్చారా? లేక కేసీఆర్ కోసమో లేదంటే ఆయనకు టుంబం కోసం వచ్చారా? అని తీవ్ర విమర్శలు గుప్పించారు. అవసమైతే సభ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు. తెలంగాణలో భూముల ఆడిటింగ్ జరగాలని పదేళ్లుగా తాను డిమాండ్ చేస్తున్నానని, బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన భూముల ఆడిటింగ్ చేయాలని కోరారు.

Tags

Next Story