TS : జూలైలో రేవంత్‌రెడ్డి జైలుకే.. దోస్త్ ధర్మపురి అర్వింద్ సంచలనం
నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ .. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌లో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి శిక్ష తప్పదని అన్నారు. జూలైలో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని ధర్మపురి అర్వింద్ అన్నారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడు జైలుకు వెళ్తాడా అని కాంగ్రెస్‌లోని ముఖ్యనాయకులంతా ఎదురు చూస్తున్నారని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి .. రేవంత్ రెడ్డి ఎప్పుడు జైలుకు వెళ్తారా అని ఎదురుచూస్తున్నారని అన్నారు అర్వింద్. జూలై 14వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. రేవంత్ జైలుకు పోతే వారంతా సంబరాలు చేసుకుంటారని అన్నారు.
కాంగ్రెస్ పై పంచులు విసిరిన అర్వింద్.. ఆరు గ్యారెంటీలే అసలైన ఆరు గాడిద గుడ్లు అంటూ విమర్శలు చేశారు. గాడిద గుడ్లు మోసేవారిని ఏమనాలి? ముఖ్యమంత్రి గుడ్లు మోయడం ఏంటో అంటూ ధర్మపురి అర్వింద్ విమర్శలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com