MP Seats : 17 ఎంపీ స్థానాల్లో ధర్మసమాజ్‌ పార్టీ పోటీ

MP  Seats : 17 ఎంపీ స్థానాల్లో ధర్మసమాజ్‌ పార్టీ పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో ధర్మసమాజ్‌ పార్టీ 17 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌ వెల్లడించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో గుండాటి నర్సింగ్‌రావు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ తమ పార్టీ అభ్యర్థులకు చెప్పుల గుర్తు కేటాయించిందన్నారు. బుధవారం బర్కత్‌పురలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 14 మంది అభ్యర్థుల తొలి జాబితాను ఆయన ప్రకటించారు. అగ్రవర్ణ పాలకులను చెప్పులతో గ్రామాల నుంచి తరిమికొడతామని ఆయన హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకే కోవకు చెందినవని, ఆ పార్టీలను ఓడించేందుకే ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలిపారు.

భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కొంగరి లింగస్వామి, సికింద్రాబాద్‌ – రాసాల వినోద్‌యాదవ్‌, చేవెళ్లే – తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్‌, మెదక్‌ – అన్నెల లక్ష్మణ్‌, వరంగల్‌ – మేకల సుమన్‌, హైదరాబాద్‌ – గడ్డం హరీష్‌గౌడ్‌, నల్లగొండ – తలారి రాంబాబు, మహబూబాబాద్‌ – రవ్వ భద్రమ్మ, మహబూబ్‌నగర్‌ – గంట్లవెల్లి రాకేష్‌, మల్కాజ్‌గిరి – బోయిన్‌ దుర్గాప్రసాద్‌యాదవ్‌, కరీంనగర్‌ – చిలువేరు శ్రీకాంత్‌, నిజామాబాద్‌ – కండెల సుమన్‌, జహీరాబాద్‌ – టి. దేవశిఖామణి, ఆదిలాబాద్‌లో – పవార్‌ కృష్ణ పోటీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.

మిగతా మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామన్నారు. సమావేశంలో ధర్మసమాజ్‌ పార్టీ రాష్ట్ర నాయకులు దుర్గాప్రసాద్‌, అన్నెల లక్ష్మణ్‌, కేడల ప్రసాద్‌, హరీష్‌గౌడ్‌, రాఘవేంద్ర ముదిరాజ్‌, వినోద్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story