Fish Prasadam : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ

Fish Prasadam : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులతో కలిసి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్. చేప ప్రసాదం కోసం మన రాష్ట్రంతో పాటు వేరే రాష్ట్రాల నుంచి జనం వచ్చారు. ఎంట్రన్స్ దగ్గర 18 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 32 కౌంటర్ల ద్వారా చేప పిల్లల కొనుగోలు టోకెన్లు ఇస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

ఇవాళ, రేపు 2 రోజుల పాటు జరిగే చేప ప్రసాదం పంపిణీ కోసం దాదాపు 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా. లక్షా 60 వేల కొరమీను చేపలు పంపిణీకి రెడీగా ఉంచామన్నారు ఫిషరీస్ డిపార్ట్ మెంట్ అధికారులు. వచ్చే వారి సంఖ్య పెరిగితే అదనంగా చేపలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. 20 వేల మందికి సరిపడా వసతి, భోజనం, తాగునీటికి ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు.

మరోవైపు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి 130 స్పెషల్ సర్వీసులు నడుపుతోంది ఆర్టీసీ. రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామన్నారు ఆర్టీసీ అధికారులు. చేపప్రసాదం పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇవాళ, రేపు ఎంజే మార్కెట్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను అబిడ్స్, జీపీవో మీదుగా మళ్లిస్తున్నారు. ఎంజే బ్రిడ్జ్ , బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ ను అలస్క్ నుంచి దారుస్సాలం, ఏక్ మినార్ వైపు డైవర్ట్ చేస్తున్నారు.

Tags

Next Story