TG : రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దు: ఏఈవో

రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దని నల్గొండ(D) పాలెం గ్రామానికి చెందిన AEO పరశురాములు సీఎం రేవంత్‌ను ( CM Revanth Reddy ) కోరారు. కుటుంబంలో తానొక్కడినే కిందిస్థాయి ఉద్యోగినని, ఇద్దరు తమ్ముళ్లు కూలీ పనులు చేస్తారన్నారు. తనకు ఉద్యోగం ఉందని తల్లిదండ్రులకు రేషన్ కార్డు తొలగించి, ఫించన్లు ఇవ్వడం లేదని తెలిపారు. తన తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు.
ఒకేసారి రూ.2 లక్షల వరకు రైతురుణాలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో సోమవారం మార్గదర్శకాలు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎలాంటి సందిగ్ధం లేకుండా స్పష్టంగా ఉండాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాల్లోని కొన్నింటిని పరిగణనలోకి తీసుకొని, వీలైనంత ఎక్కువ మంది రైతులకు రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అటు కేసీఆర్ సీఎంగా ఉండగానే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనని KTR కు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజల మాటలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆయన ట్వీట్ చేశారు. ORR, సింగరేణిని అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బొగ్గు గనులను కాపాడి తీరుతామని సీఎం స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com