TG : జీవన్ రెడ్డికి సముచిత గౌరవం : సీఎం రేవంత్

TG : జీవన్ రెడ్డికి సముచిత గౌరవం : సీఎం రేవంత్
X

పీసీసీ చీఫ్ గా తనపేరును కాంగ్రెస్ అధినాయకత్వం 2021 జూన్ 27న ప్రకటించిందని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఢిల్లీలో చెప్పారు. జులై 7న చార్జి తీసుకున్నానని అన్నారు. తన పదవీకాలం పూర్తయిందని, అందరినీ సమన్వయం చేసుకుంటూ.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్ని కలను సమర్థవంతంగా నిర్వహించానని చెప్పారు. తన పదవీకాలం పూర్తయినం దున సమర్థులకు, సామాజికవర్గాలను బేరీజు వేసుకోవాలని అధిష్టానానికి తాను విన్నవించినట్టు సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ జీవస్ రెడ్డి ( Jeevan Reddy ) గౌరవాన్ని కాపాడుతామని, వారి అనుభవాన్ని ఈ ప్రభుత్వం తప్పకుండా వినియోగించుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాపీని విస్తృతంగా ప్రజల్లో తీసుకుపోవడంలో జీవన్ రెడ్డి అనుభవాన్ని ఈ ప్రభుత్వం వినియోగిస్తుందన్నారు

ఎమ్మెల్యే సంజయ్ చేరిక నేపథ్యంలో కమ్యూనినేషన్ గ్యాప్ వచ్చిందన్నారు.శ్రీధర్ బాబు చొరవ తీసుకొని విషయాన్ని హై కమాండ్ దృష్టికితీసుకొచ్చారని అన్నారు . మంత్రి తో చర్చించి నష్టం జరగకుండా చూశారని చెప్పారు. జీవన్ రెడ్డి చర్యల వల్ల పరిణామాల పై కొన్ని గుంట నక్కలు ఎదురుచూశాయని, వినియోగించుకుంటుదన్నారు.

Tags

Next Story