EC : పంటనష్ట పరిహారానికి ఈసీ అనుమతి

EC : పంటనష్ట పరిహారానికి ఈసీ అనుమతి

వడగళ్లు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులకు ఈసీ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 10 జిల్లాల్లో 15 వేల 814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేసిన అధికారులు.. త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఎకరానికి రూ. 10వేల చొప్పున నష్టపోయిన రైతులకు రూ.15వేలల81 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అత్యధికంగా కామారెడ్డిలో 10 వేల 328 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

మార్చి నెలలో నాలుగైదు రోజుల పాటు కురిసిన వడగండ్ల వానలు, అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంట నష్టం జరిగింది. సర్కారు ఆదేశాలతో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్షేత్రస్థాయి అధికారులతో పంట నష్టంపై ఎన్యూమరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపట్టింది. ఏఈవో, ఏవో స్థాయి అధికారులు గ్రామాల్లోకి వెళ్లి నేరుగా పొలాల వద్ద పంట నష్టంపై సర్వే చేశారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని గుర్తించడంతో పాటు రైతుల వివరాలను సేకరించారు.15,814.03 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తేల్చారు. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10,328.04 ఎకరాల్లో నష్టం జరిగినట్టు గుర్తించారు.

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 1,652 .25 ఎకరాలు, సిరిసిల్లలో 1,014 .06 ఎకరాలు, మిగతా సిద్దిపేట, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో వెయ్యి ఎకరాల లోపు నష్టం జరిగింది. నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంచిర్యాల, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఐదు వందల ఎకరాల లోపు నష్టం జరుగగా, సంగారెడ్డి జిల్లాలో 76.04 ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం15,246 మంది రైతులకు చెందిన 15,814.03 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తేల్చిన వ్యవసాయశాఖ అధికారులు సర్కారుకు నివేదించారు.

Tags

Read MoreRead Less
Next Story