Rythu Bharosa Scheme : ఎవరెవరికి రైతు భరోసా అంటే?

రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రైతుభరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తోంది. బీడు భూములు, రోడ్లు, రియల్ వెంచర్లకూ ఈ పథకం వర్తించకూడదని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే 10 రోజుల్లోగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తోంది.
రైతు భరోసా’పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధ్యక్షతన సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలనుసేకరిస్తోంది. ఇందులో భాగంగా డిచ్‌పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లితోపాటు ముప్కాల్, ఎడపల్లి మండల కేంద్రాల్లోని రైతువేదికల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో నియోజకవర్గాల రైతుల అభిప్రాయాలను సేకరించారు.
ఈ కార్యక్రమంలో మెంట్రాజ్‌పల్లిలో ఏడీఏ ప్రదీప్‌కుమార్, ఏవో రాంబాబు, విండో చైర్మన్లు రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతునేస్తం కార్యక్రమం ద్వారా మంగళవారం నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com