TG : బుర్రా వెంకటేశం మెయిల్‌ ఐడీ హ్యాక్‌

TG : బుర్రా వెంకటేశం మెయిల్‌ ఐడీ హ్యాక్‌
X

రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ( Burra Venkatesham ) మెయిల్‌ ఐడీ హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు. కొందరు మోసగాళ్లు ఉద్యోగులు, సాధారణ ప్రజలకు మెయిల్స్‌ పంపుతూ డబ్బులు అడుగుతున్నారని చెప్పారు. వీటికి స్పందించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హ్యాకింగ్‌పై ఫిర్యాదు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఇటువంటి ఈ-మెయిల్‌, వాట్సాప్‌ ద్వారా ఎవరైనా సంప్రదిస్తే వెంటనే వాటిని బ్లాక్‌ చేయాలని, ఇలా మోసపూరిత మెయిల్స్‌ పంపేవారిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Tags

Next Story