TG : తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఈటల రాజేందర్!

TG : తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఈటల రాజేందర్!

బీజేపీ ( BJP ) జాతీయాధ్యక్షుడిగా ఉన్న జగత్ ప్రకాశ్ నడ్డా ( JP Nadda ) పదవి కాలం పూర్తవుతోంది. ఆయన కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో.. జాతీయ బీజేపీకి, పలు రాష్ట్రాల బీజేపీకి కొత్త అధ్యక్షులు రానున్నారు. పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నికపై జాతీయస్థాయిలో కసరత్తు జరుగుతోంది.

నడ్డా స్థానంలో ఎవరికి చోటు కల్పిస్తారన్న విషయంపై విస్తృతంగా చర్చ కూడా జరుగుతోంది. భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి నేతల పేర్లు వినిపించినప్పటికీ.. ఆ ఇద్దరూ కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో.. కేబినెట్లో చోటు దక్కించుకోలేకపోయిన నేతలకే పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పార్టీకి సీట్లు పడిపోవడంతో ట్రబుల్ షూటర్ ను దింపాల్సిన టైం వచ్చింది. త్వరలోనే పేరు ప్రకటించే చాన్సుంది.

మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది తేలిపోయింది. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో.. ఈటల రాజేందర్ వైపు మొగ్గింది హైకమాండ్. కిషన్ రెడ్డి హయాంలో పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కీలక బాధ్యత మోసిన ఈటల రాజేందర్ లోక్ సభ రేసులో సక్సెస్ అయ్యారు. మంచి ఫలితాలు రాబట్టడంతో ఆయనకే అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించనున్నారు. అమిత్ షా సూచనతో.. బీజేపీ కీలక నేత హిమాంద బిశ్వ శర్మ కూడా ఈటలను ఆదివారం సాయంత్రం కలిశారు. పార్టీ రాష్ట్ర బాధ్యతల అప్పగింతపై ఆయనతో చర్చించి అంగీకారం తీసుకున్నారు.

Tags

Next Story