TS : ప్రపంచం తలకిందులైనా రుణమాఫీ చేస్తా : రేవంత్ రెడ్డి

ప్రపంచం తలకిందులైనా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా రుణమాఫీ ఆగదు. అది పూర్తి చేసి రైతుల రుణం తీర్చుకుంటాం’ అని తెలిపారు. ఏపీలో నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటే తప్పిదమన్నట్లుగా మోదీ ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.
తనతోపాటు సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కోమటిరెడ్డి పోరాట యోధుడు. తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేస్తే.. కేసీఆర్ దొంగ దీక్ష చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోరాటం చేసి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు వచ్చినా బీజేపీలో కలిపేస్తారు. ప్రధాని మోదీతో కేసీఆర్ ఏనాడూ పోరాడలేదు’ అని ఆయన మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com