Mayor Gadwal Vijayalakshmi : డెంగ్యూ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

Mayor Gadwal Vijayalakshmi : డెంగ్యూ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలి :  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

డెంగ్యూ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి కాటా తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ, ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమల నియంత్రణకు నగర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వర్షాకాలం అయినందున, దోమలతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నట్లయితే దోమల నియంత్రణ తో పాటు వ్యాధులు తగ్గుముఖం పడతాయన్నారు. నగరంలో డెంగ్యూ ప్రబలుతున్న దృష్ట్యా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేయాల్సిన పనులు, చేయకూడని పనుల పై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య విభాగం అధికారులకు సూచించారు.

ఏ.ఎం.హెచ్.ఓ లు తమ విధులు బాధ్యత గా నిర్వర్తించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలన్నారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ వద్ద పుష్ కార్ట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్ ఎఫ్ ఏ లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ఏ ఎం హెచ్ ఓ ల పనితీరును సి.ఎం.హెచ్.ఓ లు పర్యవేక్షించాలని తెలిపారు

Tags

Next Story