Exclusive : వందలాది మంది గర్భిణీ స్త్రీలు.. ఒక్కరే గైనకాలజిస్ట్!

Exclusive : వందలాది మంది గర్భిణీ స్త్రీలు.. ఒక్కరే గైనకాలజిస్ట్!
X

నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానాకు మందుళ్ళు గోళీలు అంటూ ఎర్రనీళ్ల మందు సున్నపు నీళ్ల సూదులు నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానకు కడుపు నొప్పి అంటూ సర్కారు దవాఖానకు పోతే కాంపౌండర్ వచ్చి కాలుకు పట్టి కట్టే కన్నుకు బాధ అంటూ సర్కారు ధవాఖానకు పోతే ఉన్న కన్నులే పీకేస్తారంట నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానా కు వాడు చిట్టి రాస్తే లంచం వీడు గేటు తీస్తే లంచం నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానా కు ఇది ఓ సినిమాలో ఓ పాత్ర కానీ ప్రస్తుతం సరిపడా వైద్య సిబ్బంది లేక అటు గర్భిణీ స్త్రీలు ఇటు చిన్నారులు రోగులు సైతం సర్కారు ధవాఖానకు అడుగు పెట్టాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో నాటి నుండి నేటి వరకు సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందికే పని భారంగా మారింది ఆరుగురు గైనకాలజిస్టులు ఉండాల్సిన ప్రభుత్వసుపత్రిలో ఒక్కరే విధులు నిర్వహిస్తుండడం దానికి తోడు గతంలో ప్రతి నెల 60 మంది గర్భిణీ స్త్రీల డెలివరీలు అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 120 కి పైగా చేరింది.

షాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలైనటువంటి కొందుర్గు చౌదర్ గూడ కేశంపేట నందిగామ కొత్తూరు మండలాల నుండే కాకుండా షాబాద్ బాలనగర్ మండలాల నుంచి కూడా గర్భిణీ స్త్రీలు సైతం ఇక్కడికి వైద్యం కోసం వస్తున్న పరిస్థితి నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది గర్భిణీ స్త్రీలకు ప్రతి సోమవారము గురువారము ఓపి చూడడంతో పాటు ప్రతి బుధవారము నాడు వారికి నార్మల్ డెలివరీలతో పాటు అవసరమయ్యే వారికి సిజేరియన్లు కూడా చేస్తున్నారు ఒక్కరే గైనకాలజిస్ట్ ఉండడంతో వారిపైనే తీవ్ర పనిభారం పడుతుంది.

Tags

Next Story