TS : పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు మామూలుగా లేవుగా..!

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో అవతరణ దినోత్సవ ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. కార్యక్రమం నిర్వహించనున్న పరేడ్ గ్రౌండ్స్ లో చేపట్టాల్సిన చర్యలను గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సభాప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు, బారికేడింగ్, సభా ప్రాంగణంలో విధ్యుత్, మంచినీటి సరఫరా, మైక్ సిస్టం, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాట్ల వివరాలను ఆయాశాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బందోబస్తు, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, వీఐపీల రాకపోకలకు అంతరాయం కలుగకుండా చేపట్టబోయే చర్యల వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధినేత్రి, ఇతర రాజకీయ, సినీ, పారిశ్రామిక, సాంస్కృతిక రంగ ప్రముఖులు వస్తున్న ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com