Gold Scam: చౌక ధరకు బంగారం పేరుతో కుచ్చుటోపీ

Gold Scam: చౌక ధరకు బంగారం పేరుతో కుచ్చుటోపీ
X

తక్కువ ధరకే బంగారం అంటూ కోట్లు కొల్లగొట్టారు కేటుగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. బాధితులు క్రైమ్ కంట్రోల్ స్టేషన్ లో ఫిర్యాదుచేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

గోల్డ్ స్కీం పేరుతో ఓ ముఠా జనాలను బురిడీ కొట్టించింది. 4 కోట్లు కాజేసి పరారైంది. తమ స్కీంలో 50 వేల రూపాయలు కట్టి చేరితే.. బంగారం మార్కెట్ రేట్ కంటే 10 శాతం తక్కువకు ఇస్తామని నమ్మిస్తూ వచ్చింది ముఠా. దగ్గరి బంధువులు, స్నేహితులు, అమాయకుల నుంచి ఎక్కువగా డబ్బులు రాబట్టారు కేటుగాళ్లు.

అలా చైన్ బిజినెస్ ద్వారా కోట్లు రాబట్టి ఎగ్గొట్టి మోసం చేసిన కేటుగాళ్లు.. కాజేసిన డబ్బులతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. విశాల్, వినయ్, నిఖిల్ అనే ముగ్గురు ముఠా సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 4 కోట్ల రూపాయలు కాజేసి పరారైన వీరికోసం సీసీఎస్ పోలీసులు గాలింపు చేపట్టారు.

Tags

Next Story