Farmer Suicide : భైంసాలో రైతు ఆత్మహత్య

Farmer Suicide : భైంసాలో రైతు ఆత్మహత్య
X

తెలంగాణ రాష్ట్రంలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భైంసాలోని దస్తూరాబాద్ మండలం మున్యాల గోండు గూడెంకు చెందిన పూర్కా జగన్ (45) మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు సేవించి ఆపస్మారక స్థితిలోకి వెళ్లి పోయారు. ఈ విషయాన్ని గమనించిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటీన ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడున్న వైద్యులు ఆయన్ను పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారని ఎస్ఐ శంకర్ తెలిపారు. మృతుడు మద్యానికి బానిసైనట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags

Next Story