TG : రైతు రుణమాఫీ, రైతు భరోసా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

TG : రైతు రుణమాఫీ, రైతు భరోసా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
X

రైతు రుణమాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9 కి ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ రుణమాఫీని కూడా ఏకకాలంలో చేయనున్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీ పంట రుణాల మాఫీ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో పాటు మ్యానిఫెస్టోలో చేర్చింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో రుణమాఫీ కూడా ఒక ప్రధానమైన గ్యారెంటీ. ఇందులో అత్యంత కీలకమైన మార్గదర్శకాలు ఉండబోతున్నాయి. చాలా పకడ్బందీగా మార్గదర్శకాలు నిర్దేశించినట్లు సమాచారం.

ఇప్పటివరకు అయితే కటాఫ్ డేట్ ను డిసెంబర్ 12, 2018 నుంచి 2023 డిసెంబర్ 9గా నిర్ణయించింది ప్రభుత్వం. ఆ తేదీల్లో రైతులు తీసుకున్న రూ.2లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయనుంది సర్కార్. రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం జులై 15లోగా నివేదిక ఇస్తుందని.. ఆ తర్వాత రైతు భరోసా నిధులపై గైడ్ లైన్స్ విడుదల అవుతాయని సీఎం తెలిపారు.

Tags

Next Story