Health Policy : త్వరలో హెల్త్ పాలసీ.. PHCల బలోపేతం: మంత్రి రాజనర్సింహ

నూతన హెల్త్ పాలసీ మీద ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో మెడికల్ ఓపీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఆరోగ్య పథకాల అమల్లో ఇబ్బందులను గుర్తిస్తాం. PHCలను బలోపేతం చేస్తాం. ప్రస్తుతం అన్ని చోట్లా ఇన్‌ఛార్జి పోస్టులే ఉన్నాయి. త్వరలో వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తాం’ అని పేర్కొన్నారు.
త్వరలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చెయ్యాల్సి ఉందని, ప్రభుత్వంతో చర్చించి త్వరలో ఆ దిశగా అడుగులు వేస్తామన్నారు. త్వరలో ఉస్మానియా ఆస్పత్రి లో నర్సింగ్ కాలేజీ విద్యార్దులకు హాస్టల్ భవనం కట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో హెల్త్ పాలసీ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. ప్రైమరీ, సెకండరీ హెల్త్ పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రేట్స్ రివైస్ చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జూన్ 27 వరకు హైదరాబాద్‌లో ఉన్న 11,17,118 మంది పిల్లలకు ఈ మాత్రలు ఇస్తామన్నారు. 1-19 ఏళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రులు తప్పక ఈ మాత్రలు ఇప్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com