Siddipet : గంటల్లో కొడుకు పెళ్లి.. గుండెపోటుతో తండ్రి మృతి

కొన్ని గంటల్లో కొడుకు పెళ్లి చూసి మురిసిపోవాల్సిన తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ కొడుకు శ్రీనివాస్‌కు సిరిసిల్ల జిల్లా యువతితో ఆదివారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే తెల్లవారు జామున 3గంటలకు ఆయన హార్ట్ అటాక్‌తో కుప్పకూలాడు. కొడుకు పెళ్లి చూడకుండా ఆ తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇటీవల ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లికి చెందిన కుడిక్యాల బాలచంద్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 21న బాలచంద్రం పెద్ద కూతురు మహాలక్ష్మి పెళ్లి జరగనుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి తంతు కూడా ప్రారంభం అయింది. ఇక తాళికట్టే కొద్ది సమయంలో బాలచంద్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనంతరం హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com