Telangana: పండుగ పూట విషాదం.. పుణ్యస్నానాలకు వెళ్లి పలువురు గల్లంతు..

Telangana: పండుగ పూట విషాదం.. పుణ్యస్నానాలకు వెళ్లి పలువురు గల్లంతు..
Telangana: మహా శివరాత్రి సందర్భంగా నదులు, కాలువల్లో పుణ్యస్నానాలకు వెళ్లి పలువురు గల్లంతయ్యారు.

Telangana: పండుగ పూట తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా నదులు, కాలువల్లో పుణ్యస్నానాలకు వెళ్లి పలువురు గల్లంతయ్యారు. కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌-టి మండలం లోనవెల్లి వద్ద ప్రాణహిత నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఓ మహిళను కాపాడారు అక్కడే ఉన్న 108 అంబులెన్స్‌ డ్రైవర్‌. తల్లి, కుమారుడు అదృశ్యమయ్యారు. పద్మ, రక్షిత్‌ కోసం గాలిస్తున్నారు.

అటు.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం వద్ద గోదావరిలో స్నానానికి దిగి సాయి అనే యువకుడు గల్లంతయ్యాడు. తన కళ్ల ముందే కొడుకు గల్లంతవడం చూసి తల్లి గుండె విలవిలలాడింది. గల్లంతైన సాయి కోసం గాలింపు చేపట్టారు.

నెల్లూరు జిల్లా జంగాలపల్లి వద్ద తెలుగు గంగ కాలువలో దిగి బంగారుపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దీంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రతాప్‌, బాలాజీ కోసం గాలింపు చేపట్టారు. తెలుగుగంగ కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story