TG : పుప్పాలగూడలో అగ్నిప్రమాదం

TG : పుప్పాలగూడలో అగ్నిప్రమాదం
X

రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోల్డెన్‌ ఓరియో అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. మంటలను చూసి అపార్ట్‌మెంట్‌ వాసులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన ఫ్లాట్‌ నుంచి ఐదుగురు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఫ్లాట్ పూర్తిగా దగ్ధమయ్యింది. దాచుకున్న డబ్బులు, బట్టలు, విలువైన సామాగ్రి దగ్ధమైంది. దాదాపు 50 లక్షల ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని బిల్డర్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఫైరింజన్ వెళ్లేందుకు దారిలేకపోవడంతో చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. మూడు ఫైర్ ఇంజిన్‌లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి

Tags

Next Story