Karteeka Somavaram: కార్తీక మాసం మొదటి సోమవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

Karteeka Somavaram: కార్తీక మాసం మొదటి సోమవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు
Karteeka Somavaram: తెలంగాణలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివకేశవులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు..

Karteeka Somavaram: తెలంగాణలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివకేశవులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. గోదావరి నదీ తీరాన భక్తజన సంద్రం కనిపిస్తోంది..

భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.. పవిత్ర స్నానాలు చేశారు.. అనంతరం నదీ తీరంలో తులసి మొక్కను ప్రతిష్టించి తులసి మాతకు దీపారాధన చేసి మొక్కలు చెల్లించుకున్నారు.

విశిష్ట కార్తీక మా సోమవారం సందర్భంగా కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది.. తెల్లవారుజాము నుంచే దుర్గా మల్లేశ్వరస్వామి కొలువై ఉన్న విజయ విఘ్నేశ్వర ఆలయంలో భక్తులు దీపాలను వెలిగించారు.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.. దుర్గా మల్లేశ్వర స్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం పంచాక్షరి మంత్రంతో మార్మోగుతోంది.. భక్తులు ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు.. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.. స్వామి వారి ధర్మ దర్శనానికి ప్రస్తుతం ఆరు గంటల సమయం పడుతోంది.


కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు శివాలయాలకు పోటెత్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి భక్తులు తెల్లవారుజామున తరలివచ్చి దీపారాధన చేశారు. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వదిలారు. ఉమ్మడి తూర్పుగోదారి జిల్లాలతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది.

పల్నాడు జిల్లా కోటప్పకొండకు భక్తులు తరలివచ్చారు. కార్తీక సోమవారం సందర్బంగా త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు అర్చకులు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదులుతున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో అమరేశ్వరాలయం కోలాహలంగా మారింది.


ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజామున 3గంటల నుంచే భక్తుల క్యూలైన్లలో నిలబడ్డారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story