TS : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

TS : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

ముథోల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి (Vitthal Reddy) కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్, మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి, విఠ‌ల్ రెడ్డి ఇద్దరూ క‌లిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటార‌నే ప్రచారం నేప‌థ్యంలో ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత‌లు ఆందోళ‌న‌లు నిర్వహించారు. దీంతో ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి కంటే ముందు విఠ‌ల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2014 కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన విఠల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు.ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కోక్కరుగా కాంగ్రెస్‌, బీజేపీలలో చేరుతుండటం గులాబీ పార్టీ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తుంది. వరుస వలసలతో ఆ పార్టీ నాయకత్వం సతమతమవుతుంది. తమ నాయకులు పార్టీ మారుతున్న తీరు చూసి కేడర్ ఆందోళనకు గురవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story