Former MLA Son : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అరెస్ట్

దాదాపు 4 నెలలుగా పరారీలో ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కుమారుడు రహీల్ అమీర్ అలియాస్ సాహిల్ అరెస్ట్ అయ్యాడు. పోలీసులు ఆదివారం ఏప్రిల్ 7 అర్థరాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సోమవారం ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
డిసెంబర్ 23న, No-TS 13 ET 0777 గల బీఎండబ్ల్యూ కారు సీఎం క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారికేడ్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో సాహిల్ కారు నడపడంతో.. ఘటనలో బారికేడ్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చి మొదట నోటీసులు జారీ చేశారు. దుబాయ్ వెళ్లాడని తెలియడంతో.. పోలీసులు గతంలో లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.
డ్రైవర్ కూడా నేరాన్ని అంగీకరించడానికి ముందుకు వచ్చాడు. డ్రైవర్, వారి పరస్పర స్నేహితుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఏడు నుంచి పది కార్లు ఉన్నాయి. కారు మార్చి, ఎమ్మెల్యే కొడుకు లేడని నిరూపించి, కారు డ్రైవర్ ను దోషిని చేసే క్రమంలో పలువులు పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com