TS : మందా జగన్నాథంకు బిగ్ షాక్ .. నామినేషన్‌ తిరస్కరణ

TS : మందా జగన్నాథంకు బిగ్ షాక్ ..  నామినేషన్‌ తిరస్కరణ

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంకు బిగ్ షాక్ తగిలింది. బీఎస్పీ తరఫున ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. గడువు ముగిసేలోగా బీఫామ్ సమర్పించక పోవడంతోనే తిరస్కరించినట్లు చెప్పారు. నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. జగన్నాథం 4 సార్లు ఎంపీగా గెలిచారు.

వరంగల్‌ స్థానానికి మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్‌ స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన పత్రాలను తిరస్కరించారు. 10 మంది ప్రతిపాదకుల పేర్లు ప్రస్తావించినప్పటికీ అందులో ఎవరూ సంతకాలు చేయకపోవడం.. అఫిడవిట్‌లో నిర్దిష్ట ఖాళీలు ఉన్నాయని ఆర్వో ప్రావీణ్య తెలిపారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. మొత్తం 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 267 మంది అభ్యర్థుల పత్రాలను అధికారులు తిరస్కరించారు. 626 నామినేషన్లకు ఆమోదం తెలిపారు. నాగర్ కర్నూల్ బీఎస్పీ అభ్యర్థి మందా జగన్నాథం, వరంగల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బాబూమోహన్ దాఖలు చేసిన పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా మల్కాజిగిరిలో 77 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story