TS : నేనూ కేసీఆర్ బాధితుడినే: ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు SIB మాజీ OSD ప్రభాకర్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. తాను కూడా కేసీఆర్ బాధితుడినేనని చెప్పారు. గతంలో నల్గొండ ఎస్పీగా తప్పించారని, ఐజీగా పదోన్నతి కల్పించడంలోనూ 5 నెలలు ఆలస్యం చేశారని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు. తనకు ఇంటెలిజెన్స్‌లో ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండటంతోనే ఎస్‌ఐబీ ఛీప్‌గా నియమించారని చెప్పారు.
అనారోగ్యం కారణంగా చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు చెప్పిన ప్రభాకర్ రావు.. జూన్ 26న రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రతిపక్ష నేతలు, పలువురు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలతో పలువురు పోలీసు ఉన్నతాధికారులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది.
మరోవైపు.. ఎస్‌ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com