TS : హైకోర్టులో మాజీ ఓఎస్టీ హరికృష్ణకు బిగ్ రిలీఫ్

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ (Hakimpet Sports School) మాజీ ఓఎస్టీ హరికృష్ణకు (Harikrishna) హైకోర్టులో ఊరట లభించింది. విద్యార్థినులపై లైంగిక ఆరోపణల నేపథ్యంతో ఆయనపై విధించిన సస్పె న్షన్ ను ఎత్తివేయాలని ఆదేశించింది. కేసు విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ సైతం ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా హరికృష్ణను తొలగించారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది.
2023 ఆగస్టు 13న ఓఎస్టీ హరికృష్ణ విద్యా ర్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. దీన్ని సవాలు చేస్తూ హరికృష్ణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. అతనిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది.
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ 'నిరాధార ఆరోపణలతో నన్ను సస్పెండ్ చేశారు. నా నిజాయితీని నిరూపించుకునేందుకే కోర్టును ఆశ్రయించాను. నన్ను నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. హరికృష్ణ స్థానంలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఇన్‌చార్జి ఓఎస్డీగా హైదరాబాద్ జిల్లా క్రీడా అధికారిగా పనిచేస్తున్న సుధాకర్‌ను నియమించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com