TS : బీజేపీలో చేరిన తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ మాజీ గవర్నర్ (Telangana Former Governor) తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) తిరిగి బీజేపీలో (BJP) జాయిన్ అయ్యారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కాషాయా కండువా కప్పుకున్నారు. తమిళిసై రాకను పార్టీ అధ్యక్షుడు అన్నామలై స్వాగతించారు. ఆమె పాలనా అనుభవం, ప్రజలకు సేవల చేయాలన్న తపనను కొనియాడారు. గతంలో బీజేపీలోనే ఉన్న తమిళిసై రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఇటీవల తమిళిసై తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.
కాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు లోని కన్యాకుమారి లేదా తిరునల్వేలి లేదా చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. బీజేపీ సైతం మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. త్వరలో పెండింగ్ లో ఉన్న సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉన్నందున , రాజీనామాకు బీజేపీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే తమిళిసై పదవి నుంచి వైదొలిగినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com