TG : రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
X
By - Manikanta |4 Nov 2024 12:00 PM IST
మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మనోహరాబాద్ మండలం పోతారం వద్ద రోడ్డుపై స్థానిక రైతులు ధాన్యం ఆరబోశారు. ధాన్యం కుప్పలు ఉండడంతో రోడ్డుకు ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్.. ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఆంజనేయులు, ఆయన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com